అఫీషియల్: గ్లోబల్ స్టార్ టేకోవర్ సంక్రాంతికే.. కానీ


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకరే తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే క్రిస్మస్ కానుకగా అంటూ ముందే ఫిక్స్ చేశారు.

కానీ కొన్ని కారణాలు రీత్యా ఈ భారీ చిత్రం సంక్రాంతికి వస్తుంది అని రూమర్స్ వచ్చాయి. మరి ఫైనల్ గా ఇదే నిజం అయ్యింది. తమ గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు, యూవీ క్రియేషన్స్ వారు ఆల్రెడీ సంక్రాంతికి అనౌన్స్ చేసిన విశ్వంభర ని మరో తేదికి మార్చుకున్నారని అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని దిల్ రాజు స్పెషల్ వీడియో ద్వారా ఈ విజయదశమి సందర్భంగా రివీల్ చేశారు.

అలాగే ఆల్రెడీ గేమ్ ఛేంజర్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇంకా టీజర్ మిగతా పాటలు రాబోతున్నాయి. మరి RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎలా మారారో గేమ్ ఛేంజర్ ని కూడా గ్లోబల్ లెవెల్లో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దామని దిల్ రాజు కన్ఫర్మ్ చేసారు.

దీనితో గ్లోబల్ స్టార్ టేకోవర్ వచ్చే ఏడాది సంక్రాంతికి ఉండనుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ ఇంకా గేమ్ ఛేంజర్ వచ్చే డేట్ ఏంటి అనేది రివీల్ చెయ్యలేదు. తమ కోసం విశ్వంభర వెనక్కి వెళ్ళింది అన్నారు కానీ విశ్వంభర డేట్ లోనే వస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. సో ఈ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వాల్సింది. మరి చూడాలి గేమ్ ఛేంజర్ ఏ డేట్ లో వస్తుంది అనేది.

Exit mobile version