టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఇన్నేళ్ల సినిమాల్లో ఏ సినిమా తాలూకా పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుందో అభిమానులకి బాగా తెలుసు. మరి చిరుకి సరైన సినిమా పడాలి కాని బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఊహించని లాభాలు తాను అందిస్తారు. అలా స్ట్రైట్ సినిమా “వాల్తేరు వీరయ్య” తో తక్కువ రేటింగ్స్ తో కూడా భారీ లాభాలు అందించారు.
అలాగే ఈ సినిమా తర్వాత చేస్తున్న మరో స్ట్రైట్ సినిమానే “విశ్వంభర”. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ ట్రీట్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫైనల్ గా టీజర్ ని మేకర్స్ ఈ దసరా కానుకగా రిలీజ్ చేసేసారు. మరి ఈ టీజర్ మాత్రం ఒక ఊహించని విజువల్స్ తో మరో లోకం లోకి తీసుకెళ్లే విధంగా ఉందని చెప్పాలి.
అలాగే మెగాస్టార్ ఎంట్రీ రెక్కల గుర్రం మీద అయితే దాని తాలూకా గ్రాఫిక్స్ మంచి నాచురల్ గా కనిపిస్తున్నాయి. అలాగే భూమి మీద ఉండే చిరు పాత్ర ఒక బలమైన కారణంతో మరో లోకం లోకి వెళ్లినట్టుగా కనిపిస్తుంది. అలాగే అక్కడ వింత వింత జంతువులు, కొన్ని తెగల మనుషులు చూస్తే వశిష్ట విజన్ కనిపిస్తుంది. అలాగే కీరవాణి స్కోర్ కూడా ఇందులో బాగుంది. ఇలా ఈ సినిమా టీజర్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి.