పిక్ టాక్: “కల్కి 2898 ఎడి” నుంచి జక్కన్న క్రేజీ లుక్ వైరల్

మన ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు టాప్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. వరుస తన సినిమాలతో తెలుగు సినిమాని, భారతీయ సినిమాని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టిన జక్కన్న దర్శకునిగానే కాకుండా నటునిగా కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలా తాను నటించిన రీసెంట్ భారీ చిత్రమే “కల్కి 2898 ఎడి”.

దర్శకుడు నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో జక్కన్న ఇంట్రెస్టింగ్ క్యామియోలో కనిపించిన సంగతి తెలిసిందే. మరి తన లుక్ సినిమాలో పూర్తిగా రివీల్ కాలేదు కానీ ఇప్పుడు కొన్ని క్రేజీ స్టిల్స్ మాత్రం వైరల్ గా మారాయి. బ్రౌన్ టీ షర్ట్ దానిపైన స్టైలిష్ జాకెట్ లో జక్కన్న అదరగొట్టారని చెప్పాలి. దీనితో కల్కి 2898 ఎడి నుంచి ఈ అన్ సీన్ స్టిల్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version