“గేమ్ ఛేంజర్” నెక్స్ట్ అప్డేట్ కి టైం ఫిక్స్


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరికి మార్చినట్టుగా ఖరారు చేసేసారు. అయితే ఈ అప్డేట్ తో పాటుగా టీజర్, నెక్స్ట్ సాంగ్స్ ఎప్పుడు ఏంటి అనే వివరాలు కూడా ఇస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఇక లేటెస్ట్ గా మేకర్స్ మరో అప్డేట్ తో వచ్చారు. ఈ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి స్పెషల్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా తెలిపారు. మరి ఇది టీజర్ కోసమా లేక నెక్స్ట్ సాంగ్ కోసమా అనేది దానితో క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

Exit mobile version