లేటెస్ట్: దసరా కానుకగా అదిరిపోయిన పవన్ “వీరమల్లు” పోస్టర్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే సినిమా బ్యాలన్స్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసుకుంది. ఇక షూట్ స్టార్ట్ చేసుకోవడంతోనే అభిమానుల్లో మళ్ళీ కొంచెం ఉత్సాహం మొదలైంది. అయితే నేడు విజయదశమి కానుకగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని ఇప్పుడు రివీల్ చేశారు.

మరి దసరా కానుకగా ఓ సరికొత్త పోస్టర్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా పవర్ఫుల్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ఇందులో వారియర్ లుక్ లో పవన్ విల్లు పట్టుకొని మూడు బాణాలుతో గురి పెట్టినట్టుగా కనిపిస్తున్నారు. దీనితో ఈ పోస్టర్ మాత్రం ఇంటెన్స్ గా అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version