ప్రభాస్ మళ్ళీ పరిచయం..అదిరే లెవెల్లో “ఈశ్వర్” రీరిలీజ్ ట్రైలర్

టాలీవుడ్ డార్లింగ్ హీరో పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. అయితే తాను డెబ్యూ ఇచ్చిన “ఈశ్వర్” సినిమాని మాత్రం తన తన ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.. ఒక ఊరమాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ తో మళ్ళీ టాలీవుడ్ లో ప్రభాస్ పరిచయం కానున్నారని చెప్పాలి.

ఈ అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈశ్వర్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాలు ఓ రేంజ్ లో హైప్ ని చూస్తున్నాయి.

ఇక ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరో బర్త్ డేని కూడా ఈశ్వర్ రీ రిలీజ్‌తో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే అప్పుడు మిస్ అయ్యిన ఈశ్వర్‌ను థియేటర్లో ఎంజాయ్ చేసేందుకు ఇది రెబల్ ఫ్యాన్స్ కి మంచి అవకాశం అని చెప్పాలి. దీనితో తమ అభిమాన హీరోతో కలిసి కొన్నేళ్లు వారు కూడా వెనక్కి వెళ్లొచ్చని చెప్పాలి. మరి ఈ సినిమాకి ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయో చూడాలి.

Exit mobile version