‘కూలీ’ కోసం బాలీవుడ్ బిగ్ స్టార్ దాదాపు ఖాయం?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “వేట్టయన్” రిలీజ్ కి వచ్చి డీసెంట్ టాక్ అండ్ వసూళ్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కాకుండా రజినీకాంత్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న భారీ యాక్షన్ మల్టీ స్టారర్ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.

ఇలా ఈ సినిమాలో చాలా వరకు బిగ్ స్టార్స్ కనిపించనున్నారు. అలా హిందీ నుంచి బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ నటించనున్నారని పలు రూమర్స్ కూడా బయటకి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పుడు మరింత క్లారిటీ వినిపిస్తుంది. దీని ప్రకారం అమీర్ ఖాన్ కూలీ సెట్స్ లో త్వరలోనే అడుగు పెట్టనున్నట్టుగా కోలీవుడ్ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా తనతో సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version