అఫీషియల్: సంక్రాంతికి రానున్న NBK109

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK109 ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో బాలకృష్ణ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమా నుండి దసరా సందర్భంగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్ట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈమేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ఇక ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతి బరిలో వస్తుండటంతో, ఇప్పుడు పండగ పూట భారీ పోటీ నెలకొననుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version