“లియో 2” కి ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేసిన లోకేష్

ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ చివరి సినిమా అలాగే తన 69వ సినిమాని దర్శకుడు హెచ్ వినోద్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంకి ముందు విజయ్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలకి సీక్వెల్స్ అయితే ఉన్నాయి. మరి వాటిలో క్రేజీ సీక్వెల్ చిత్రం “లియో 2” కూడా ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో చేసిన భారీ సినిమా ఇది కాగా దీనికి పార్ట్ 2 కూడా ఉందని తాను అనౌన్స్ చేసాడు.

అయితే రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో పార్ట్ 2 కోసం తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఒకవేళ తనకి పార్ట్ 2 చేసే అవకాశం వస్తే దానికి “పార్తిబన్” అనే టైటిల్ ని లాక్ చేసినట్టుగా అనౌన్స్ చేసాడు. అయితే విజయ్ ఇపుడు మొదలు పెట్టిన సినిమా తర్వాత సినిమాలు ఆపేస్తున్నట్టుగా తెలిపాడు. అందుకే ఒకవేళ ఛాన్స్ వస్తే అన్నట్టుగా లోకేష్ క్లారిటీ ఇచ్చాడు. మరి విజయ్ పాలిటిక్స్ లో ఉన్నప్పటికీ సినిమాలు చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version