‘ది రాజా సాబ్’ పండుగ అప్డేట్.. మారుతీ క్లారిటీ

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ ఫాంటసీ వండర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ఫ్యాన్స్ కి వింటేజ్ ట్రీట్ ఇచ్చే విధంగా మేకర్స్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండగా డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో ఇపుడు హ్యాపీ గానే ఉన్నారు. అయితే నిన్న దసరా కానుకగా అయితే చాలా సినిమాల నుంచి మేజర్ అప్డేట్స్ బయటకి వచ్చాయి కానీ ది రాజా సాబ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఎందుకంటే ఈ సినిమా నిన్న పండుగతో కూడా షూటింగ్ లోనే బిజీగా ఉంది. దీనితో దర్శకుడు మారుతీ సింపుల్ గా విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజా సాబ్ షూట్ లో మరో శాటిస్ఫయింగ్ రోజు ఇది అంటూ కాజువల్ అప్డేట్ ని అందించారు. సో సినిమా మాత్రం అకేషన్స్ తో సంబంధం లేకుండా తెరకెక్కుతుంది అని చెప్పాలి.

అలాగే పోస్టర్స్ లాంటివి షూటింగ్ అయ్యిపోయిన తర్వాతే వస్తాయని క్లారిటీ కూడా ఇచ్చారు. అంతే కాకుండా తాము వినాయకచవితి, దసరా అని తేడా లేకుండా షూట్ చేస్తున్నామని మారుతి తెలిపారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version