“దేవర” హైక్స్ క్రెడిట్ పవన్ గారిదే..నాగ వంశీ కామెంట్స్


ప్రస్తుతం మన టాలీవుడ్ దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ వసూళ్లు రాబట్టిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా “దేవర” అనే చెప్పాలి. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ వసూళ్లు కొల్లగొట్టింది. అయితే ఈ వసూళ్ల విషయంలో టికెట్ ధరల హైక్స్ మాత్రం చాలా కీలకపాత్ర పోషించాయి అని చెప్పాలి.

మరి ఈ క్రెడిట్ మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే చెందుతుంది అని నిర్మాత అలాగే దేవర సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన నాగవంశీ కీలక కామెంట్స్ చేశారు. ఇలా దేవర కి హైక్ కోసం అడిగిన వెంటనే కందుల దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే స్పందించారు అని ఇండస్ట్రీ బాగు కోసం తాము అడిగిన హైక్ ని ఓకే చేశారు అని ఆ క్రెడిట్ కళ్యాణ్ గారికే దక్కుతుంది అని తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version