టీవీ ప్రీమియర్‌కి సిద్ధమైన ధనుష్ ‘రాయన్’

తమిళ హీరో ధనుష్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ ‘రాయన్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలోని మాస్ అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

ఇక ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యింది. రాయన్ చిత్రాన్ని దీపావళి కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయనున్నట్లు ప్రముఖ టీవీ ఛానల్ జెమిని అనౌన్స్ చేసింది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నట్లు వారు ప్రకటించారు.

థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేసిన రాయన్, బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

Exit mobile version