సుప్రీమ్ హీరో బర్త్‌డే ట్రీట్‌గా SDT18 వరల్డ్ గ్లింప్స్.. అదిరింది!

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్(సాయి ధరమ్ తేజ్) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో 18వ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రోహిత్ కెపి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని SDT18 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తుండగా.. ‘హను-మాన్’ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నాడు.

కాగా, సాయి తేజ్ బర్త్ డే ట్రీట్‌గా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం నుండి సినిమాను ఎంత భారీగా తెరకెక్కిస్తున్నారో మనకు చూపెట్టారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్, పీరియాడిక్ మూవీ కావడంతో ఆకాలం నాటి పరిస్థితులను మనకు చూపెట్టనున్నారు. దీని కోసం చిత్ర యూనిట్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం భారీ ఆయుధాలను డిజైన్ చేయడం, ఆర్టిస్టుల మేకోవర్.. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో సాయి తేజ్ తన బాడీని మలుచుకున్న తీరు సూపర్‌గా ఉందని అభిమానులు అంటున్నారు. సాయి తేజ్ ఈ సినిమా కోసం బీస్ట్ మోడ్‌లోకి మారిపోయాడు.

ఇలా సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ కూడా SDT18 కోసం ఎంతలా కష్టపడుతున్నారో మనకు ఈ వీడియో గ్లింప్స్‌లో చూపెట్టారు. ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version