‘ఎల్లమ్మ’కు ఓకే చెప్పిన నితిన్..?

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా వేణు యెల్దండి తనలోని ట్యాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయగా, మంచి బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. దీంతో దిల్ రాజు వేణుతో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును రెడీ చేశారు. ఇక ఈ సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

అయితే, ఈ సినిమాను తొలుత న్యాచురల్ స్టార్ నానితో చేయాలని వేణు భావించాడు. కానీ, అది కుదర్లేదు. దీంతో శర్వానంద్, తేజా సజ్జా వంటి హీరోలకు వేణు ‘ఎల్లమ్మ’ కథను వినిపించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కథను మరో హీరో నితిన్‌కి వినిపించగా, ఆయన ఈ సినిమాకు ఓకేచెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ‘ఎల్లమ్మ’ సినిమాను త్వరలోనే ప్రారంభించి చిత్ర షూటింగ్‌ను కూడా మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

ఇక హీరో నితిన్ ప్రస్తుతం ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ముగించుకుని ‘ఎల్లమ్మ’లో నితిన్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version