‘దేవర’ హిట్‌పై ఎన్టీఆర్ రెస్పాన్స్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘దేవర పార్ట్ 1’కి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో, భారీ క్యాస్టింగ్ నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అదనపు బలంగా నిలిచింది.

బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ చిత్రానికి దక్కిన రెస్పాన్స్ చూసిన తాజాగా ఎన్టీఆర్ స్పందించాడు. ఆయన ఈ సందర్భంగా ఒక థ్యాంక్స్ లెటర్ రాశారు. ‘దేవర పార్ట్ 1’ చిత్రానికి ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఆయన ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ, ఈ సినిమాను ఇంత విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన చిత్ర యూనిట్, నటీనటులు అందరికీ తారక్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డ దర్శకుడు కొరటాల శివకు తారక్ స్పెషల్ థ్యాంక్స్ తెలిపాడు. ఈ సినిమాను ప్రదర్శించిన డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల ప్రదర్శకులకు ఆయన ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలిపారు. ఇలా తారక్ ‘దేవర’ హిట్‌పై రెస్పాండ్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version