ప్రభాస్ ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్.. ‘సలార్’ స్పెషల్ షోలు!

అక్టోబర్ 23న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తు్న్నారు. అటు ఆయన నటించిన సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ వారు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు ప్రభాస్ ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన ‘సలార్’ చిత్రాన్ని స్పెషల్ షోలుగా ప్రదర్శించనున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో ‘సలార్’ స్పెషల్ షోలు వేయబోతున్నట్లు వారు ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ షోలకు రావాలని, తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అభిమానులు పిలుపునిస్తున్నారు.

బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఇలా ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సరికొత్త పంథాకు తెరలేపారు. ఇక ‘సలార్’ స్పెషల్ షోలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. అభిమానుల సందడి ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.

Exit mobile version