‘విశ్వంభర’ కోసం మరో డైరెక్టర్ రానున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ వేసవి కానుకగా రిలీజ్‌ కానుంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేయగా పూర్తి మైథలాజికల్ ఫాంటెసీ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమా నుండి రీసెంట్‌గా టీజర్‌ని రిలీజ్ చేయగా, దానికి మిక్సిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లోని వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది.

దీంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానిక మరో డైరెక్టర్ సాయం అందేలా చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘విశ్వంభర’ చిత్రాన్ని ఎలాంటి నెగెటివిటీ లేకుండా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు వివి.వినాయక్‌ను ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ వర్క్స్‌ను పర్యవీక్షించేందుకు చిరు రిక్వెస్ట్ చేశాడట.

వినాయక్ తన ఎక్స్‌పీరియెన్స్‌ని వినియోగించి ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ పనులను చూసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక తొలుత ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి నిజంగానే వివి.వినాయక్ ‘విశ్వంభర’ కోసం వర్క్ చేయనున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version