అఫీషియల్: నాని-ఓదెల2 మూవీ కోసం అనిరుధ్!

న్యాచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల‌తో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంగీతం అందించేందుకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకున్నట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. అనిరుధ్ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని వారు రివీల్ చేశారు. నాని టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌కి అనిరుధ్ మ్యూజిక్ తోడైతే ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, నాని ప్రస్తుతం ‘హిట్-3’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, తన నెక్స్ట్ మూవీలో జాయిన్ అయ్యేందుకు నాని ప్రయత్నిస్తున్నాడు.

Exit mobile version