ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. ఏకంగా ఆరు సినిమాలు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ రావడంతో పాటు, ఆయన నటించిన సినిమాలు రీ-రిలీజ్ అవుతుండటంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ప్రభాస్ పుట్టినరోజున ఏకంగా ఆరు సినిమాలు రీ-రిలీజ్ అవుతుండటం విశేషం.

ఈసారి ప్రభాస్ పుట్టినరోజు కానుకగా మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసి తమ అభిమానం చాటుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేస్తాయా అని వారు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుండి ఓ సాలిడ్ అప్టేడ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా అందాల భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version