పవన్ కళ్యాణ్ తొలి టైటిల్‌తో యాంకర్ ప్రదీప్ సినిమా!

బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా కూడా నటించాడు. ఆయన నటించిన తొలి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ప్రదీప్ తన రెండో సినిమాను అనౌన్స్ చేశాడు.

నితిన్-భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్ మూవీలో ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో బుల్లితెర యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ టైటిల్‌ను గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రానికి వినియోగించాడు. ఇప్పుడు పవన్ టైటిల్‌తో ప్రదీప్ మాచిరాజు సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశారు.

ఇక ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తుండగా మాంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ బ్యాన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version