ముంబైలో ‘కంగువా’ ప్రమోషన్స్‌లో సూర్య బిజీ!

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కించగా, పూర్తి ఫాంటెసీ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ అభిమానులను అలరించనుంది. ఇక ఈ సినిమాలో సూర్య సరికొత్త లుక్స్‌తో కనిపిస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండటంతో, ఈ మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ముంబైలో నిర్వహించారు. ఈ ప్రమోషన్స్‌లో హీరో సూర్యతో పాటు ‘కంగువా’ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా పాల్గొన్నారు. బాలీవుడ్ మీడియా, అభిమానులతో ‘కంగువా’ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వారు పంచుకున్నారు.

ఇక ‘కంగువా’ చిత్రంతో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అందాల భామ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 14న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది.

Exit mobile version