మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ లని గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుగా మార్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. మరి ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇది కాగా ఈ చిత్రం ఎన్నో వండర్స్ సెట్ చేసింది. అయితే ఈ సినిమా మన దేశంలో రన్ ఏమో కానీ జపాన్ దేశంలో అయితే మన దగ్గర కంటే భారీ రన్ ని చూసింది.
అక్కడ ఏకంగా సంవత్సరాలు తరబడి రన్ అవుతుంది. అలా లేటెస్ట్ గా మేకర్స్ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. జపాన్ లోని ఒక హిస్టారికల్ థియేటర్ లో RRR సినిమా ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలు నిర్విరామంగా రన్ కావడం ఎంతో ఆనందంగా ఒకింత ఎమోషనల్ గా కూడా ఉందని వారు తెలుపుతున్నారు. మరి ఈ రేంజ్ లో ఓ భారతీయ సినిమా అందులోని మన తెలుగు సినిమా రన్ కావడం అనేది చిన్న విషయం అయితే కాదని చెప్పాలి.
It’s heartwarming to see a 71-year-old theatre in Japan, tweeting that #RRRMovie has been playing continuously for 1 year and 9 months. ❤️
The film is ending its final one-week run at the screen starting tomorrow.
ありがとうございます。???? https://t.co/qrOTSC67Jt
— RRR Movie (@RRRMovie) October 17, 2024