పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ సమయం కంటే రిలీజ్ అయ్యి ఓటిటిలో వచ్చాక మంచి రిపీట్స్ పడ్డాయని చెప్పాలి. అలా ఈ భారీ సినిమా ఇప్పుడు మంచి కల్ట్ ఫాలోయింగ్ ని తెచ్చుకోగా ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేసేందుకు సలార్ దేవరతా రైజర్ సిద్ధం అయ్యాడు.
ఈసారి ప్రభాస్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కి ఈ చిత్రం వస్తుండగా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. దీనితో ఈ చిత్రం మళ్ళీ మ్యానియా చూపిస్తుంది అని చెప్పాలి. మరి సింగిల్ స్క్రీన్స్ లో అయితే బుకింగ్స్ శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి. దీనితో మరోసారి సలార్ మ్యానియా గట్టిగా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే త్వరలోనే పార్ట్ 2 కూడా మొదలు కానుంది.