టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా షూటింగ్స్ కి హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి.
మరి పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా దీనిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ సందర్భానుసారం పవన్ గొంతులో పాడాల్సిన సాంగ్ ఉంటుందట. మరి ఈ సాంగ్ ని పవన్ కేవలం ఒక గంటలో కంప్లీట్ చేసేసినట్టుగా తెలుస్తుంది.
పవన్ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న సెట్స్ లోనే రీ రికార్డింగ్ కోసం స్పెషల్ సెటప్ చేసి పవన్ తోనే ఒక గంటలో ఫినిష్ చేసేసారట. అలాగే ఆ సాంగ్ ఐడియా కూడా పవన్ దే అన్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగ్ అవుట్ పుట్ కూడా బాగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా కూడా ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్పొచ్చు.