మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామా ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టి తన సత్తా చాటాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూ్స్ చేశాయి.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు. దీంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ను ఆయన తన డిస్ట్రిబ్యూషన్ టీమ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ‘దేవర’ భారీ సక్సెస్ కావడంతో తన టీమ్ సభ్యులకు నాగవంశీ గ్రాండ్ పార్టీని ఇచ్చాడు. దుబాయ్‌లో ఈ పార్టీని ఇచ్చాడు నాగవంశీ. ఈ సినిమాతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ఎగ్జిబిటర్లు లాభాలను చూశారని వారు చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.