ఫోటో మూమెంట్: ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌లో డైరెక్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా, ఇందులో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

ఇక ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌లో నేడు దర్శకుడు జ్యోతికృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. హరిహర వీరమల్లు లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నందుకు చిత్ర యూనిట్ సభ్యులు డైరెక్టర్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఆయన ఇలాంటి బర్త్‌డేలు మరిన్ని జరుపుకోవాలని వారు కోరారు.

ఈ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు నిర్మాత ఏఎం.రత్నం, నటుడు నాజర్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, అయ్యప్ప శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మార్చి 28, 2025లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

Exit mobile version