టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా తరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అయితే, ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని కూడా అనౌన్స్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అక్టోబర్ 19న సన్నీ డియోల్ పుట్టినరోజు కానుకగా ఈ ట్రీట్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 19న ఉదయం 10.44 గంటలకు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ రణ్‌దీప్ హుడా, అందాల భామ రెజినీ క్యాసాండ్ర, సయ్యామి ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ఎలాంటి పవర్‌ఫుల్ టైటిల్‌ను పెడతారో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.