‘విశ్వం’కి పెరిగిన థియేటర్ల సంఖ్య

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ దసరా బరిలో రిలీజ్ అయిన మిగతా సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, ప్రేక్షకులకు ‘విశ్వం’ మాత్రమే ఛాయిస్‌గా మిగిలింది.

దీంతో ఈ సినిమాకు రెస్పాన్స్ పెరుగుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. అంతేగాక, ఈ చిత్రానికి అదనంగా మరో 300 థియేటర్లు యాడ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇలా మిక్సిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాకి థియేటర్స్ యాడ్ చేయడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అటు ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర లేకపోవడం, ఈ వారం ఒక్క బిగ్, మీడియం బడ్జెట్ సినిమా కూడా లేకపోవడంతో ‘విశ్వం’కు కొంతలో కొంత ప్లస్ అయ్యిందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా భారీ క్యాస్టింగ్ ఇందులో యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version