ఎన్టీఆర్ స్టార్ పవర్.. “దేవర” విషయంలో అంతా సేఫ్!?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. మరి ఎన్నో అంచనాలు నడుమ ఎన్టీఆర్ నుంచి చాలా ఏళ్ళు తర్వాత సోలోగా వచ్చిన భారీ చిత్రమే ఇది. మరి ఆ అంచనాలకి తగ్గట్టుగా టాక్ రాకపోయినప్పటికీ సినిమా ఏకంగా 500 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టార్ పవర్ ని చూపించింది.

అయితే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి బిజినెస్ జరిగింది. అయితే ఈ బిజినెస్ మొత్తాన్ని కూడా దేవర అదే మిక్స్డ్ టాక్ తో రాబట్టేసినట్టుగా తెలుస్తుంది. దీనితో దేవర ని కొన్నవారు నష్టపోలేదనే ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తుంది. మొత్తానికి చాలా కాలం తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమా భారీ వసూళ్లు అది కూడా మంచి లాంగ్ రన్ ని కొనసాగించి అదరగొట్టింది అని చెప్పాలి.

Exit mobile version