బాలయ్య షోలో సూపర్ స్పెషల్ ఎపిసోడ్..!?

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ సినిమాని దర్శకుడు బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి బాలయ్య సినిమాలు సహా సెన్సేషనల్ ఓటిటి హిట్ షో అన్ స్టాపబుల్ ని కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మొత్తం మూడు సీజన్లని సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన బాలయ్య ఈసారి నాలుగో సీజన్లోకి వచ్చారు.

అయితే ఈ సీజన్ ని డబుల్ ఫీస్ట్ ఎంటర్టైన్మెంట్ తో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈసారి కొందరు రిపీటెడ్ గెస్టులు కూడా ఉంటారని టాక్ ఉంది. అలా ఇపుడు ఓ సూపర్ స్పెషల్ ఎపిసోడ్ చిత్రీకరణకు రంగం సిద్ధం అయినట్టుగా వినిపిస్తుంది. లాస్ట్ టైం సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ ని అప్పటి మాజీ ముఖ్యమంత్రి అలాగే బాలయ్యకి బావ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుతో చేసిన సంగతి తెలిసిందే.

ఆ ఎపిసోడ్ బిగ్గెస్ట్ హిట్ కూడా అయ్యింది. అయితే ఈసారి పవర్ లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుతో బాలయ్య షోలో సూపర్ స్పెషల్ ఎపిసోడ్ కి ప్లానింగ్ జరుగుతుందట. షూటింగ్ కూడా ఈ రెండు రోజుల్లోనే ఉంటుంది అని కూడా తెలుస్తుంది. మొత్తానికి మరోసారి వీరి క్రేజీ కాంబినేషన్ లో ఓ అదిరే ఎపిసోడ్ ని ఆహా తీసుకొస్తుంది అని చెప్పలి.

Exit mobile version