‘ఎన్టీఆర్ – హృతిక్’ పై ఛేజింగ్ సీక్వెన్స్

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఐతే, వార్ 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ అడుగు పెట్టేందుకు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ ల పై ఓ భారీ ఛేజింగ్ సీన్ ను షూట్ చేయడానికి ‘వార్ 2 టీమ్’ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ ఛేజింగ్ సీక్వెన్స్ లో హృతిక్ రోష‌న్‌ – ఎన్టీఆర్ లతో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటారని టాక్ నడుస్తోంది.

ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version