అన్‌స్టాపబుల్‌ మేకింగ్ వీడియో వైరల్

బాలయ్య బాబుని సరికొత్తగా చూపించిన టాక్‌ షో.. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ టాక్‌ షో సూపర్ హిట్ అయ్యింది. ఈ షోకి బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. పైగా ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్‌ లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే 4వ సీజన్ రాబోతుంది. తాజాగా 4వ సీజన్‌ కు సంబంధించిన ప్రోమో మేకింగ్ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బాలయ్యను ఎలా షూట్‌ చేశారు ?, సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించేందుకు టీమ్‌ ఎంతలా కష్టపడంది ? అన్న సంగతులను ఈ మేకింగ్ వీడియోలో చూపించారు.

కాగా ఈ ప్రాసెస్‌ను టీమ్‌ ఎంతో ఎంజాయ్‌ చేసిందో కూడా ఈ ప్రోమో మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి బాలయ్య బాబు డైలగ్స్‌ చెబుతూ, జై బాలయ్య అంటూ టీమ్ ‘ప్రోమో డిజైన్‌ చేయడం’ బాగుంది. ప్రస్తుతం ఈ ప్రోమో మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే సీజన్‌4 తొలి ఎపిసోడ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, అల్లు అర్జున్‌, సూర్య, దుల్కర్‌ సల్మన్‌ ల పేర్లు కూడా గెస్ట్ ల లిస్ట్ లో వినిపిస్తున్నాయి. మరి 4వ సీజన్ లో ఎవరు కనిపిస్తారో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version