‘అఖండ 2 – తాండవం’ పై లేటెస్ట్ అప్ డేట్

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ కి ఇంకా సమయం ఉన్నప్పటికీ, కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను కూడా తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నటీనటుల ఎంపిక పై కసరత్తులు చేస్తున్నారు.

ఇప్పటికే, ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

Exit mobile version