SSMB 29: మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్


ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రానున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సినిమా అని చెప్పాలి. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి జక్కన్న అండ్ టీం ఒక ఊహించని విజువల్ అడ్వెంచర్ వండర్ గా ప్లాన్ చేస్తున్నారు.

మరి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాపై పక్కాగా ఈ డిసెంబర్ లో అఫీషియల్ అప్డేట్ అయితే ఒకటి రానుందట. అలాగే ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో RRR కి మించి విజువల్ ఎఫెక్ట్స్ అలాగే యానిమల్ సీక్వెన్స్ లు ఎక్కువే ఉంటాయి అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ప్రపంచమే షాకయ్యే క్రేజీ ప్రాజెక్ట్ మన నుంచి రాబోతుంది అని చెప్పాలి.

Exit mobile version