“జై హనుమాన్”.. ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ అప్డేట్

మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో తేజ సజ్జ అలాగే టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో చేసిన భారీ హిట్ చిత్రం “హను మాన్” అని తెలిసిందే. మరి ఈ సినిమాకి క్రేజీ సీక్వెల్ “జై హనుమాన్” ని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ సహా మరిన్ని సినిమాలు చేస్తున్న యువ దర్శకుడు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇచ్చాడు. ఒక కోతి తన దగ్గరకి వచ్చిన పిక్ ని పోస్ట్ చేసి “మేము మళ్ళీ కలిసాం ఇదే సంకేతం” అంటూ పోస్ట్ చేసాడు. అలాగే దివాళి వస్తుంది అంటూ కూడా ఒక ట్యాగ్ పెట్టాడు.

దీనితో ఈ దీపావళికి జై హనుమాన్ నుంచి అప్డేట్ ఉండొచ్చని హిట్ ఇచ్చాడు. మరి ఆల్రెడీ పార్ట్ 2లో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఉన్నట్టుగా టాక్ వచ్చింది. మరి దీనిపై ఏమన్నా అప్డేట్ ఆరోజున ఇస్తాడో అనేది చూడాలి. మొత్తానికి అయితే జై హనుమాన్ పై అభిమానులు ఎదురు చూస్తున ఆసక్తికర అప్డేట్ వచ్చేలానే ఉందని చెప్పాలి.

Exit mobile version