Salaar: ఇండియన్ ఓటిటిలో “సలార్” భారీ రికార్డ్


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సలార్” కోసం తెలిసిందే. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ తర్వాత ఓటిటి రిలీజ్ కి వచ్చి కూడా భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా సౌత్ భాషలు సహా ఇంగ్లీష్ భాషలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకొస్తే హిందీలో డిస్నీ+ హాట్ స్టార్ వారు తీసుకొచ్చారు. అయితే ఇందులో సలార్ బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసింది. మరి హాట్ స్టార్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 250 రోజులు ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచినట్టుగా వారు తెలిపారు.

దీనితో సలార్ హిందీ వెర్షన్ ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అర్ధం చేసుకోవచ్చు. హాట్ స్టార్ లో హిందీ సినిమాలు కొత్త సినిమాలు కూడా చాలానే ఉన్నప్పటికీ సలార్ ఈ ఫీట్ ని సెట్ చెయ్యడం విశేషం. అయితే దీనిని హాట్ స్టార్ వారు నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు. మొత్తానికి అయితే సలార్ విధ్వంసం ఈ లెవెల్లో ఉందని చెప్పాలి.

Exit mobile version