ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “అమరన్”


ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి వస్తున్నా సౌత్ చిత్రాల్లో కోలీవుడ్ యాక్షన్ చిత్రం “అమరన్” కూడా ఒకటి. టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ అలాగే సాయి పల్లవి కాంబినేషన్ లో దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా విడుదలకి రాబోతుంది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ్ లో డీసెంట్ బజ్ లోనే ఉంది.

అయితే ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇప్పుడు రివీల్ అయ్యాయి. ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అయితే విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్ వారే ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా థియేటర్స్ లో వచ్చాక దాదాపు పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందులో రానుంది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహించారు.

Exit mobile version