“ఖైదీ 2” లో డిల్లీ వర్సెస్ రోలెక్స్.. కన్ఫర్మ్ చేసిన నటుడు


మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మూవీ లవర్స్ ని బాగా ఎగ్జైట్ చేసిన సినిమాల్లో “విక్రమ్” కి స్పెషల్ స్పేస్ ఉంటుంది అని చెప్పాలి. అలాగే ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కారణం దీనికి “ఖైదీ” సినిమాకి లింక్ ఉండడంతో థియేటర్స్ లో దద్దరిల్లే రెస్పాన్స్ వచ్చింది. అలాగే అక్కడ నుంచే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కూడా మొదలు అయ్యింది.

అయితే తన రాబోయే సినిమాల్లో ఒకో కీలక పాత్ర పలు చిత్రాల్లో కనిపించడం అలాగే ఒకో స్టార్ హీరోపై సోలో సినిమాలు ఉన్నాయి అని కూడా లోకేష్ కనగరాజ్ కన్ఫర్మ్ చేసాడు. అయితే ఈ సినిమాల్లో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ సినిమా “ఖైదీ 2”. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమాపై క్రేజ్ ఇపుడు వేరే లెవెల్లో ఉంది.

అయితే ఈ పార్ట్ 2 లో తన సోదరుడు సూర్య చేసిన పవర్ఫుల్ రోల్ రోలెక్స్ కూడా ఉంటుంది అని రీసెంట్ గా స్వయంగా కార్తీ కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఖైదీ 2 లో డిల్లీ వర్సెస్ రోలెక్స్ సీన్స్ తో పీక్ ఎక్స్ పీరియన్స్ మూవీ లవర్స్ రాబోతుంది అని చెప్పాలి. మరి ఇద్దరి నడుమ సీన్స్ లోకేష్ కనగరాజ్ టేకింగ్ తో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని కూడా చెప్పొచ్చు. మరి దీనికోసం ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

Exit mobile version