“వేట్టైయన్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వేట్టయన్” కోసం తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లు అందుకుంది. అయితే సోషల్ సబ్జెక్టు తో వచ్చిన ఈ సినిమా రజినీ జైలర్ రేంజ్ హిట్ కాలేదు కానీ పర్వాలేదు అనిపించింది. తమిళ్ సహా తెలుగులో కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపించగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీనితో ఈ సినిమా రానున్న నవంబర్ 7 నుంచే ఓటిటిలో వచ్చేస్తుంది అని తెలుస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఆరోజు నుంచి పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రానా, ఫహద్ ఫాజిల్ తదితరులు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.

Exit mobile version