చాన్నాళ్ళకి ఇలాంటి సబ్జెక్టుతో రాబోతున్న చిరు..!


మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా శరవేగంగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు దీనిపై నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత చిరు తన కెరీర్ 157వ సినిమా చేయనున్నారు. అయితే నిజానికి విశ్వంభర ఆ సినిమాగా రావాల్సింది ముందుకు వచ్చింది.

ఇక తన నెక్స్ట్ సినిమాగా అయితే చిరు ఓ సాలిడ్ సబ్జెక్టుని చాలా కాలం తర్వాత టచ్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రముఖ నటుడు అలాగే రచయిత బివిఎస్ రవి రీసెంట్ గా చిరు కోసం తాము ఒక సోషల్ సబ్జెక్టుని రెడీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దీనితో మళ్ళీ ఒక ఠాగూర్, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి ట్రీట్ ని మళ్ళీ చిరు నుంచి ఆశించవచ్చు అని చెప్పాలి. మరి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version