కిరణ్ అబ్బవరం ‘క’ కోసం చైతు !


కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘క’. తెలుగులో ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్స్ లోకి రాబోతుంది. మేము ఇంతకుముందు చెప్పినట్టే.. మేకర్స్ ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ది వెస్టిన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రారంభమవుతుంది. అన్నట్టు ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

కాగా ‘క’ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి గ్యాప్ తర్వాత కిరణ్ అబ్బవరం ‘క’తో రాబోతున్నాడు. విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

Exit mobile version