టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌తో తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా కోసం మహేశ్ కొత్త లుక్ కోసం మేకోవర్ చేస్తున్నాడు. అయితే, రీసెంట్‌గా మహేశ్ బాబు ఓ యంగ్ హీరో సినిమాలో కేమియో పాత్రలో నటిస్తున్నాడనే వార్త సినీ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొట్టింది.
యంగ్ హీరో అశోక్ గల్లా నటిస్తున్న ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీలో మహేశ్ ఓ కేమియో పాత్రలో నటిస్తాడని.. ఇందులో ఆయన ఓ మైథాలజీ గెటప్‌లో కనిపిస్తాడనే బజ్ నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంపై అశోక్ గల్లా క్లారిటీ ఇచ్చాడు. మహేశ్ బాబు తన సినిమాలో ఎలాంటి కేమియో పాత్రలో నటించడం లేదని.. ఆయన ప్రస్తుతం కేవలం రాజమౌళి సినిమాపై మాత్రమే ఫోకస్ పెట్టాడని.. ఇలాంటి వార్తలతో అభిమానులను తప్పుదోవ పట్టించొద్దంటూ ఆయన రిక్వెస్ట్ చేశాడు. దీంతో మహేశ్ కేమియో రోల్ వార్తలకు చెక్ పడింది.