పవన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఈ దీపావళి కానుకగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సాంగ్ విషయంలోనే ఫ్యాన్స్ కి కొంచెం డిజప్పాయింటింగ్ న్యూస్ తప్పదు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ సాంగ్ దీపావళికి రాదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం ఫ్యాన్స్ కి కొంచెం నిరాశ కలిగించే వార్తే అని చెప్పాలి. అయితే దీనిపై మాత్రం ఒక అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. పవన్ అయితే సాంగ్ ని పడేశారని టాక్ ఉంది కానీ ఇతర పనులు విషయంలో మాత్రం మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. మరి చూడాలి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ వస్తుందో లేదో చూడాలి.

Exit mobile version