కోలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” కూడా ఒకటి. నడిప్పిన్ నాయగన్ సూర్య హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తెలుగు సహా తమిళ్ లో చాలా ఈవెంట్స్ చేస్తూ సినిమాని ఆడియెన్స్ లో ఉంచుతూ బిజీగా ఉన్నారు.
అయితే ఈ క్రమంలో చిత్ర యూనిట్ కి ఒక ఊహించని షాకింగ్ మరియు విషాద వార్త ఎదురైంది. ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ టాలెంటెడ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్ను మూయడం అది కూడా అనుమానాస్పదంగా జరగడం ఒకింత సస్పెన్స్ గా మారింది. అయితే కొచ్చిలో ఉన్నటువంటి తన అపార్ట్మెంట్ లో చనిపోయి కనిపించడం ఊహించని అంశంగా మారింది.
తాను తమిళ్ సహా మళయాళంలో పలు ఆసక్తికర సినిమాలకి తన సేవలు అందించారు. కానీ ఇపుడు ఈ రకంగా జరగడం అనేది విషాదకరం అని చెప్పాలి. మరి తన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఇక తాను వర్క్ చేసిన ఈ కంగువా సినిమా ఈ నవంబర్ 14న రిలీజ్ కి రాబోతుంది.