మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బ్లెస్సింగ్ యంగ్ హీరోస్ లో నాచురల్ పెర్ఫామర్ సుహాస్ కూడా ఒకడు. మరి సుహాస్ చిన్న చిన్న పాత్రలు నుంచి ఇప్పుడు హీరోగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు లతో వస్తున్నాడు. అలా ఈ ఏడాదిలోనే మూడు సినిమాల్తో తను వచ్చాడు. మరి అలా తాను నటించిన లేటెస్ట్ చిత్రం “జనక అయితే గనక” కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ఫీడ్ బ్యాక్ నే థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక అందుకుంది.
ఇక ఈ చిత్రానికి ఓటిటి రిలీజ్ డేట్ అయితే లాక్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందుకో ఈ సినిమా రానున్న నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఫిక్స్ అయ్యింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని అపుడు మిస్ అయ్యినవారు నవంబర్ లో చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ హిట్ ఆల్బమ్ అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.