“లక్కీ భాస్కర్” ప్రీమియర్ షోస్ కి క్రేజీ డిమాండ్


మోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “లక్కీ భాస్కర్”. మరి ట్రైలర్ తర్వాత సాలిడ్ హైప్ ని అందుకున్న ఈ సినిమాని మేకర్స్ ఎంతో నమ్మకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే తమ గత సినిమా “సార్” లానే ముందే పైడ్ ప్రీమియర్స్ కి తీసుకొచ్చారు.

అయితే ఈ సినిమా కోసం ఆడియెన్స్ కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తుండగా ఇపుడు లక్కీ భాస్కర్ కి క్రేజీ డిమాండ్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ తెలుగు స్టేట్స్ లో పదుల సంఖ్యలో ప్లాన్ చేయగా ఆల్రెడీ ఇప్పటికే ఒక్క హైదరాబాద్ సిటీ లోనే 50కి పైగా షోస్ ని వేయగా వీటికి మించి మరింత డిమాండ్ నెలకొనగా 70 కి పైగా షోస్ ఈ సాయంత్రం రాత్రికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే లక్కీ భాస్కర్ డిమాండ్ గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version