‘మాస్ జాతర’ షురూ చేసిన మాస్ రాజా!

మాస్ మహారాజ్ రవితేజ తన కెరీర్‌లో 75వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుండి దీపావళి కానుకగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి ‘‘మాస్ జాతర’’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో రవితేజ లుక్ సరికొత్తగా కనిపిస్తుండటం తో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఆయన చేతిలో ఓ గంట పట్టుకుని, బొడ్లో ఓ గన్ పెట్టుకుని యాక్షన్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పెద్ద జయింట్ వీల్ మనకు కనిపిస్తుంది. ఇలా ఓ యాక్షన్ సీక్వెన్స్‌లోని పవర్‌ఫుల్ స్టిల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు మేకర్స్.

ఇక సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా, ఈ ‘మాస్ జాతర’ చిత్రాన్ని 2025 మే 9న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Exit mobile version