పిక్ టాక్: రామ్ చరణ్‌తో థమన్.. బీస్ట్ మోడ్‌లో చరణ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో చరణ్ తన లుక్‌ని పూర్తిగా మార్చేయనున్నాడు. దీనికోసం ఆయన బీస్ట్ మోడ్‌లోకి మారుతున్నాడు. ఇప్పటికే హెవీ వర్కవుట్స్ చేస్తూ బాడీని బిల్డ్ చేస్తున్నాడు. తాజాగా థమన్ చరణ్‌ను కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో చరణ్ హెవీ బాడీతో, గుబురు గడ్డంతో మస్క్యులర్ లుక్స్‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు.

ఈ ఫోటోను మెగా ఫ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. చరణ్ మ్యాన్లీ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడని.. బుచ్చిబాబు తన సినిమాలో చరణ్ కోసం ఏదో సాలిడ్‌గానే ప్లాన్ చేశాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version