తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు వార్ సీన్స్‌తో తెరకెక్కించారు.
ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక దీపావళి కానుకగా ఈ సినిమాను తమిళ్‌తో పాటు మిగతా భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 3500కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను స్టార్ హీరో కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. జివి.ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ ‘అమరన్’ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.