ఈసారి దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ నుంచి వచ్చిన సాలిడ్ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన అవైటెడ్ సాలిడ్ థ్రిల్లర్ సినిమా “క” కూడా ఒకటి. మరి టీం అంతా ఎంతో నమ్మకంగా తీసుకొచ్చిన ఈ సినిమాకి కూడా సాలిడ్ రెస్పాన్స్ పైడ్ ప్రీమియర్స్ నుంచి వచ్చేసింది.
మరి కిరణ్ అబ్బవరం పెట్టుకున్న అంచనాలు రీచ్ అయ్యిపోయిన ఈ సినిమాకి ఇపుడు సీక్వెల్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. నిన్న పైడ్ ప్రీమియర్స్ పడ్డాక ఈ న్యూస్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఓ సక్సెస్ ఫుల్ సీక్వెల్ తో కిరణ్ అబ్బవరం రాబోతున్నాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సుజిత్ అండ్ సందీప్ లు దర్శకత్వం వహించగా చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణం వహించారు.